| Daily భారత్
Logo




దళితులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్సే

News

Posted on 2025-07-26 17:03:51

Share: Share


దళితులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్సే

సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  కేటీఆర్ ను  రోడ్లపై ఉరికించి కొట్టే రోజులు వస్తాయి

పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప పనులు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: గత పది సంవత్సరాలు  బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ ప్రతి సభలో చెప్పాడని, గతం 2014లో గెలిచిన తర్వాత కెసిఆర్ సిఎం అయ్యాడని, పూర్తిగా దళితులు మోసం చేశారని  అన్నారు. కామారెడ్డి జిల్లాలో  కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మరోసారి  పునరావృత్తమైతే, ప్రజలు రోడ్లపై ఉరికించి కొట్టే రోజులు వస్తాయని అన్నారు. ఖబర్దార్ కేటీఆర్  అని హెచ్చరించారు. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి లో గల  ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో  నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులకు మూడెకరాలు ఇస్తానని కెసిఆర్ మోసం చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గంలో  నలుగురికి స్థానం కల్పించిందని, అలాగే అసెంబ్లీ స్పీకర్ చేసిందని అన్నారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు  ఒక దళిత బిడ్డ అని అన్నారు. బిఆర్ఎస్ బిజెపి తోడుదొంగలని, రాష్ట్రానికి నిధులు రాకుండా, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు, పదేండ్ల అధికారంలో ఉండి  బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. కవితను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ కు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిందని, బిజెపి ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంటులోబీజేపీ ఎంపీలు మాట మార్చరని విమర్శించారు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కచ్చితంగా ఇచ్చి తీరుతామని అన్నారు. పాత డిజైన్ ప్రకారం మంచిప్ప  ప్రాజెక్టు పనులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి  ఉత్తంకుమార్ రెడ్డి ఒప్పుకున్నారని, 15 రోజుల్లో జీవో వస్తుందని త్వరలో జరిగే సీఎం ప్రసంగంలో మంచి ప్రస్తావన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో బిఆర్ఎస్ ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని 18 నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులతో పాటు అనేక పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుందని బిజెపి వారు చెప్పుకుంటున్నారని,బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారని అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు కూడా చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి పిసిసి డెలికేట్  శేఖర్ గౌడ్ ఎన్ డి సి సి బి  వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ లింగన్న,  సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి గోవిందు రావు, మాజీ ఎంపీపీ యాదగిరి, మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి రెడ్డి, యూత్ నాయకులు  ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాజేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >