| Daily భారత్
Logo




ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

News

Posted on 2025-07-27 16:16:08

Share: Share


ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ఒకే వేదికపై తారసపడిన ఇందూరు అర్బన్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీరామ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా లు పాల్గొన్నారు. అయితే ఇదే ఆత్మీయ సమ్మేళనం వేదిక గా తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒకే వేదికపై కనబడడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్యవైశ్యులందరూ ఇలానే పార్టీలు వేరైనప్పటికీ కలిసిమెలిసి ఐక్యతతో ఉండాలని పలువురు గుసగుసలాడారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య పెద్దలు, అధ్యక్షా  కార్యదర్శులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ1944 లో స్థాపించిన ఆర్యవైశ్య సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆర్య వైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా  అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు. సంపద సృష్టించడంలోకూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వలకు చెల్లెస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా మన సేవ ఉన్నందుకు గర్వాంగా ఉందన్నారు. అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నాం. అని రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు  ఎదగాలి ప్రభుత్వ ఏర్పాటులో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా అగ్రవర్ణాల పేదల అభివృద్ధి గురించి ఏ నాయకుడు ఆలోచించలేదని బిజెపి మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈ డబ్ల్యూ ఎస్  రిజర్వేషన్ 10% కల్పించిన ఘనత మోదీకి బిజెపి పార్టీకి దక్కుతుంది. ఆర్యవైశ్య పట్టణ సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికల్లో ధర్మం గెలిసింది అనడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. ధర్మాన్ని నిలబెట్టుటకు ఆనాడు కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ధర్మం నిలపడి  గెలిచింది అనేది వాస్తవం అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల గురించి కొంత మంది ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆలా అలోచించి చివరికి నవ్వులపాలు కావద్దని  విజ్ఞప్తి చేసారు. ఓటమిని అంగీకరించడం కూడా విజయానికి తొలిమెట్టు అవుతుందని దానికి తనే నిదర్శనం అన్నారు. నూతనంగా గెలిసిన వారందరిని అభినందిస్తూ ఈ  గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్షా, కార్యవర్గం గుర్తుపెట్టుకోవాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సంఘ అభివృద్ధిలో కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు.


ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా,మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధానకార్యదర్శి ఇల్లేందుల ప్రభాకర్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >