| Daily భారత్
Logo




పార్టీ జెండా మొయ్యని వలస పార్టీ నేతలకు పలు ఆలయాల్లో అగ్ర తాంబూలం

News

Posted on 2025-07-28 08:51:35

Share: Share


పార్టీ జెండా మొయ్యని వలస పార్టీ నేతలకు పలు ఆలయాల్లో అగ్ర తాంబూలం

ఏళ్ల తరబడిగా పార్టీ నే నమ్ముకొని పార్టీ జెండా మోస్తున్న వారికి ఏ ప్రాధాన్యత కల్పించడం లేదంటూ నిరాశలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు

కేవలం పైరవీలతోనే ఆలయాల చైర్మన్, డైరెక్టర్లుగా పదవులు కొనుక్కొని తెచ్చుకున్నారంటూ విమర్శలు

పిసిసి చీఫ్ కు ఈ విషయం తెలియదా అంటూ ఆశావాదుల ఆందోళన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరంలోని మూడు ప్రధాన ఆలయాలకు నూతన కమిటీని ఎట్టకేలకు నియమించింది. అయితే ఈ ఆలయాలకు సోమవారం నూతన కమిటీతో మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ  స్వీకారం జరగనుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ఏళ్ల తరబడిగా పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ద్వితీయ శ్రేణి, నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరాశ ల్లో ఉన్నట్లు సమాచారం. సోమవారం నగరంలోని జెండా బాలాజీ ఆలయం, నాందేవ్ వాడలోని సంతోషిమాత సాయిబాబా ఆలయం, శంభుని గుడి ఆలయాలకు నూతన కమిటీతో అధ్యక్ష కార్యదర్శులతోపాటు డైరెక్టర్లను సైతం నియమించారు. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఏళ్ల తరబడిగా ఉన్న పార్టీ వారికి కాకుండా నిన్న కాక మొన్న ఇతర పార్టీలో నుండి వచ్చిన నాయకులకు ఈ కమిటీలో అధ్యక్ష పదవులు, డైరెక్టర్ పదవులు కేటాయించడం వెనక అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కనపడని ఓ వ్యక్తికి కొందరి స్వలాభాల కోసం పార్టీ జెండా మొయ్యని వ్యక్తికి ఈరోజు ఆలయ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం వెనక కాంగ్రెస్ కార్యకర్తలు రగిలిపోతున్నారు. కాగా జెండా బాలాజీ ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం కూడా ఈ రోజే ఉన్నందున అధ్యక్ష కార్యదర్శులతో పాటు డైరెక్టర్లు కూడా కొత్త మొఖాలే కనిపిస్తున్నాయి. అలాగే శంభుని గుడిలో కూడా ఇదే తంతు గా డైరెక్టర్లు పార్టీకి చెందినవారు కాకుండా కొత్తవారిని నియమించడం ఏంటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో  సమాచారం.


Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >