Posted on 2025-07-29 10:32:41
వేలాది మందిగా తరలివచ్చిన భక్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని బోయి గల్లి లోని నాగదేవత ఆలయంలో నాగుల పంచమి పండగ సందర్భంగా ఉదయం తెల్లవారుజామున నుండి భక్తులు వేలాది సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి నాగదేవునికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం గంగాపుత్రుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నాగరాజు తెలిపారు. 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నాగదేవత ఆలయంలో తమ పూర్వీకుల కథనం ప్రకారం గతంలో ఇదే ప్రాంతంలో నాగదేవతల శిల్పాలు, శివలింగం బహిరంగ ప్రదేశాల్లో ఉండేవని తమ పూర్వికులు చెబుతున్న వివరాల ప్రకారం అప్పుడు నాగుల పంచమి పండగకు బయటనే అప్పటి వారు నాగదేవతకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకునే వారని చరిత్ర ద్వారా వారు తెలిపారని అన్నారు. ఆ తర్వాత 1980-84 సంవత్సరం కాలంలో గంగపుత్రుల సంఘ సభ్యులు అందరూ ఏకమై ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. అప్పుడు నిర్మించిన ఆ ఆలయంలో నాగదేవత విగ్రహంతో పాటు, శివలింగాన్ని ప్రతిష్టించడం జరిగిందన్నారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం నాగుల
పంచమి రోజు గంగపుత్ర సంఘ సభ్యులందరూ ఏకమై నాగుల చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ నగరంలోని ఏకైక నాగదేవత ఆలయంగా బోయి గల్లి నాగదేవత ఆలయం ప్రసిద్ధి చెందిందని వారు తెలిపారు. అంతేకాకుండా నిజామాబాద్ లో నాగదేవతకు ప్రత్యేకంగా ఆలయం ఉంది అంటే అది బోయ గల్లి లోని నాగదేవతాలయమని చరిత్రకారులు చెప్తున్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ ప్రత్యేక పూజలు
నాగుల పంచమి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బోయ గల్లిలోని నాగదేవత ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా మోక్కులు చెల్లించుకున్నారు. దేశంలో ప్రధాని మోడీ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని పున నిర్మించిన తర్వాత దేశంలో ఉన్న అన్ని ఆలయాలకు ముఖ్యంగా హిందూ దేవాలయాలకు అంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత ప్రధాని కే దక్కుతుందన్నారు. నాగేంద్ర గుడి ఆలయ కమిటీ గంగపుత్రుల సంఘం వారు నాగుల పంచమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >