Posted on 2025-07-29 16:24:23
ఘటనకు గల కారణాలపై విచారణ చేపడుతున్న పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్ కల్లు కాంపౌండ్ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. 45-50 ఏళ్ల వ్యక్తి కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం రాగ 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల కల్లు కాంపౌండ్ల వద్ద ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. కల్లు కు బానిసైనా వారు వారి వెంట మద్యం వెంట తీసుకొని వచ్చి సేవిస్తుంటారని సమాచారం అలా మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసేంతగా చివరికి హత్య చేయడనికి వెనకాడని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఆబ్కారి శాఖ కళ్ళు దుకాణాలపై కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణ నిజామాబాద్ నగరంలోని పూలంగ్ ప్రాంతంలో ఉన్న ఓ కల్లు దుకాణంలో సదరు కల్లు దుకాణ యాజమాని బ్లాక్ లో యదేచ్చగా మద్యాన్ని సైతం విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం కొసమెరుపు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >