| Daily భారత్
Logo




ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం : ఎ సి పి రాజా వెంకట్ రెడ్డి

News

Posted on 2025-08-01 10:40:45

Share: Share


ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం : ఎ సి పి రాజా వెంకట్ రెడ్డి

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఎ సి పి రాజా వెంకట్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ఎక్స్ రోడ్, బైపాస్ కాజా హోటల్ చౌరస్తా లో శుక్రవారం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించడానికి నగర ఏసిపి రాజా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సరి సమానమని ఇందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు  సహకరించాలని ఆయన కోరారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆరిఫ్, సిఐ సురేష్ ప్రత్యేక శ్రద్ధతో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈరోజు స్థానిక రూరల్ ఎస్సై ముందుకు వచ్చి ఎనిమిది సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతిక్షణం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సీసీ కెమెరాలు నిఘా పోలీస్ లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్థానికుల సహకారం లేనిదే ఏమీ చేయలేమని గ్రహించిన బైపాస్ రోడ్ ఖాజా హోటల్ చౌరస్తాలోని శ్రీ జగదాంబ హోటల్ నిర్వాహకుడు రాథోడ్ సంజయ్ సొంత ఖర్చులతో ఒక సీసీ కెమెరాను పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం అభినందనీయమన్నారు. అలాగే ప్రమాదాల నివారణ కోసం సమాజంలో సమాజ బాధ్యత గల ఓ పౌరునిగా శిశు కెమెరాలు సర్వీసింగ్ ఏర్పాటు చేసే నరేష్ ఇందులో ముందుకు వచ్చి ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగించడం అభినందనీయమన్నారు.

Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >