Posted on 2025-08-05 18:19:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతీయ జనతా పార్టీ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలనే వంచనతో కాంగ్రెస్ యాత్ర చేపట్టిందని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన జానహిత పాదయాత్రలో జనాలు కరువై జనరహిత పాదయాత్రగా మారిందని ఏద్దేవా చేసారు. గ్రామాలలో కాంగ్రెస్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేక యాత్రకు డబ్బులు ఇచ్చి జనసమీకరణ చేసారని,స్వయంగా పీసీసీ అగ్రనాయకుడు డబ్బులు పంపినాము నియోజకవర్గలలో జనసమీకరణ చేయాలనీ ఆదేశించి యాత్రను అపహస్యం చేసారన్నారు.
తెలంగాణ ప్రజలకు ఏమి ఓరగబెట్టారని కాంగ్రెస్ పాదయాత్ర చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. మహిళలకు 2500,తులం బంగారం,చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు,అవ్వ, తాతలకు 4 వేల పెన్షన్ ఇచ్చారని చేస్తున్నారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి, విద్య భరోసా 5 లక్షలు కల్పించారని చేస్తున్నారా, ఎవరి కోసం చేస్తున్నారు ప్రభుత్వం వల్ల ఏమి ఓరిగిందని చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అధిక వాటతో ఇస్తున్న సన్నబియ్యం మేము ఇస్తున్నాం అని చెప్పడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లలో అధిక శాతం వాటా కూడా కేంద్రానిదే అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నియోజకవర్గల అభివృద్ధికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని కాంగ్రెస్ యాత్ర పేరుతో పబ్బం గడపడానికి సిగ్గు ఉండాలన్నారు. 20 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి కాంగ్రెస్ నాయకులకు దమ్ము ఉంటే చర్చకు రావాలని అని సవాల్ విసిరారు. బీసీ కులగణనకు కేంద్రం అడ్డుపడుతుందని కాంగ్రెస్ మతిలేని మాటలు మాట్లాడుతుందని అసలు మీరు చేసిన కులగణన తప్పుల తడక దానిని తగాలబెట్టండి అని కాంగ్రెస్ ఎమ్మెల్సి పిలుపునిచ్చారని దాన్ని మేము ఎలా సమర్దిస్తాం అన్నారు. 61% బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చెప్తే కాంగ్రెస్ లెక్కల ప్రకారం 56% చూపెట్టడం పై గడిచిన పదేళ్లలో బీసీ బిడ్డలు అంతరించిపోయారా...? మీ దొంగ లెక్కలకు బీసీల రిజర్వేషన్ ను మైనారిటీలను దోచిపెడతాం అంటే మేము అంగీకరించాలా...?
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున లక్ష కోట్ల సంక్షేమ నిధి ఏమైంది అని ప్రశ్నించారు.మొదటి బడ్జెట్ లో వారికీ మొండి చేయి చూపెట్టారన్నారు.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎంత మందికి అందించారని ప్రశ్నించారు.
మండలానికో బీసీ గురుకులం అన్నారు దేవుడు ఎరుగు ఉన్న గురుకులాలలో విద్యార్థులు కల్తీ ఆహారంతో ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని మండిపడ్డారు. 6వేల కోట్ల ఫీ బకాయిల కారణంగా బీసీ బిడ్డలు ఇబ్బందులు పడుతు విద్యకు దూరం అయ్యే పరిస్థితి నేల్కొంటే ప్రభుత్వం ఎందుకు ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఎంత మంది బీసీలకు సమూచిత న్యాయం ఎందుకు కల్పిస్తలేరని అన్నారు మంత్రివర్గంలో 42% బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. నిన్న కాకా మొన్న ప్రభుత్వం ప్రకటించిన ఆర్టిఐ కమిషనర్లు ఐదుగురులో ఒక్క బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వలేదంటే బీసీ లపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో బీసీ మేధావులు ఆలోచన చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ ఈ డ్రామాలు ఆడుతుందో తెలంగాణ సమాజం,బీసీ బిడ్డలు అన్ని గమనిస్తున్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలు ఏకం అయ్యి కాంగ్రెస్ ను బొంద పెట్టడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ డ్రామాతో ఒకదానికొకటి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు. మోటార్లు వెయ్యి కోట్లకు వచ్చేవి రెండు వేల కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేసారన్నారు. కాళేశ్వరం అవినీతిపై బీఆర్ఎస్ నాయకులను ఎందుకు జైలుకు పంపడం లేదని అన్నారు. ప్రజలకు నిజాలు కావాలని కమీషన్ల డ్రామాలు వద్దని దమ్ముంటే కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే,శ్రీకాంత్ కార్పొరేటర్, నిజామాబాదు బిజెపి నాయకులు లక్ష్మినారాయణ, ప్రభాకర్, పవన్, ఆనంద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >