| Daily భారత్
Logo




ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులు

News

Posted on 2025-08-06 14:35:45

Share: Share


ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధికారిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి  ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి రాష్ట్రం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లో చైతన్యపరిచి ఉద్యమాలకు లేపారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగే న్యాయం అభివృద్ధిపై అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అన్ని పార్టీలను ఒక్క తాటిపైకి  తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన ఘనత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ దేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉన్నంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని ఆయన కొనియాడారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఆయన పోరాడి సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మిరియాల సురేష్ కుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రేఖా ప్రసాద్ తో పాటు సంఘం కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >