| Daily భారత్
Logo




ఘనా లో కూలిన సైనిక విమానం

News

Posted on 2025-08-07 07:31:45

Share: Share


ఘనా లో కూలిన సైనిక విమానం

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ఆఫ్రికాలోని అక్రా రాజధాని ఘనాలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. సైనిక హెలికాప్టర్ కుప్పకూలడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్యాబినెట్ మంత్రుల తో పాటు మరో ఆరుగురు.. మొత్తంగా ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమాతో పాటుగా ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. 

బుధవారం ఉదయం జెడ్-9 యుటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్ర నుంచి ఒబువాసికి చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టింది. అయితే హెలికాప్టర్ గాల్లోకి టేకాఫ్ అయిన కాసేపటికే అది ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి కుప్ప కూలింది.

హెలికాప్టర్ కుప్ప కూలిన సమయంలో దానిలో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ధాటికి హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తున్న వారంతా చనిపోయారని ఘనా దేశం ప్రకటించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నా యి. యుద్ధప్రాతిపదిక సహయక చర్యలు మొదలుపెట్టాయి. మృతదేహాలను వెలికి తీసి.. ఆస్పత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

హెలికాప్టర్ కుప్ప కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని.. నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణం గానే హెలికాప్టర్ కుప్పకూలి నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘన ప్రభుత్వం హెలికాప్టర్ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ప్రకటించింది.

దశాబ్ద కాలంలో ఘనాలో చోటు చేసుకున్న అత్యంత భయానక విమాన ప్రమాదాలలో ఇదొకటని అధికారులు తెలిపారు. 2014లో తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మరణించగా.. 2021లో రాజధాని అక్రాలో ఒక కార్గో విమానం రన్‌వేను దాటి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో 10 మంది మరణించారని వెల్లడించారు. ఇక తాజాగా సైనిక హెలికాప్టర్ కూలి ఇద్దరు కేంద్ర మంత్రులు సహా మొత్తం 8 మంది చనిపోయారు.

Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >