| Daily భారత్
Logo




కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

News

Posted on 2026-07-13 18:21:10

Share: Share


కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్ రాజా గౌడ్

డైలీ భారత్, కామారెడ్డి : బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్ రాజా గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ రాజా గౌడ్ మాట్లాడుతూ, బ్రహ్మణపల్లి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ విశేష కృషి చేశారని తెలిపారు. గ్రామానికి రూ.15 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేయడం, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.15 లక్షల నిధులు కేటాయించడం, మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయడం, అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టడం, అలాగే అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. 

అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసు...ఆ కారణంతోనే భార్య, పిల్లల హత్య

Posted On 2026-07-13 18:11:11

Readmore >
Image 1

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

Posted On 2026-07-13 18:10:28

Readmore >
Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >