Posted on 2026-07-13 13:25:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రోడ్డు ప్రమాదాలను తగ్గించి ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించరాదని జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు సిరిసిల్ల పట్టణంలోని పెట్రోల్ బంక్ యజమానులకు రాతపూర్వక నోటీసులు అందజేశారు. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయవద్దని స్పష్టం చేశారు.
ఈ నిబంధనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి పెట్రోల్ బంకులో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు సూచించారు. అలాగే, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించి, అవసరమైతే వాహనాలను సీజ్ చేసే చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నోటీసుల పంపిణీ కార్యక్రమంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి (ఎంవీఐ) వంశీధర్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారులు (ఏఏంవిఐ లు) పృద్విరాజ్ వర్మ, స్నిగ్ధ యాదవ్, కానిస్టేబుల్ రమ్య పాల్గొన్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచడం, ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >