Posted on 2025-11-17 12:20:05
ప్రజల భద్రతే పోలీస్ లక్ష్యం
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
డైలీ భారత్, సూర్యాపేట:శీతాకాలం సందర్భంగా సూర్యపేట జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిందని ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నందున వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించకపోవడం వలన ప్రమాదలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి చలిలో ప్రయాణం కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురి కావచ్చు కావున వాహనదారులు రోడ్లపై ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున చలి ప్రభావం, పొగమంచు ఎక్కువగా ఉంటుంది కావున అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలి, తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి, పాటలు మ్యూజిక్ పెట్టుకోవద్దు, ఓవర్ టేక్ చేయొద్దు, కచ్చితమైన మార్గంలో ఒకే లైన్ లో వాహనం నడపాలి, పదే పదే లైన్ క్రాస్ చేయొద్దు, ఇండికేటర్ ను వెయ్యాలి, వాహనాల మద్యలో దూరం పాటించాలి, హారన్స్, వాహన శబ్దాలను గుర్తించాలి, ఇతర వాహన డ్రైవర్ లను ఇబ్బంది పెట్టకుండా అనుసరించాలి, రోడ్లపై పరిస్థితులు గమనించాలి అని కోరారు. సురక్షితంగా ప్రయాణించి గమ్యం చేరుకావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ద్విచక్ర వాహనదారులు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
2. హై-బీమ్ వాడకండి, లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి.
3. వేగం తగ్గించి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి.
4. రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి.
5. సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త పడాలి — రోడ్డు తడిగా ఉంటే స్కిడ్ అయ్యో ప్రమాదం ఉంది.
6. టర్నింగ్ అయ్యో ముందు ఇండికేటర్ ఇవ్వాలి.
7. రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమయాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువ.
8. గ్లౌవ్స్ తప్పనిసరిగా ధరించాలి చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది.
కార్లు, పెద్ద వాహనాల డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ లైట్లు మాత్రమే వాడాలి.
2. వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి.
3. ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి.
4. డిఫాగర్ ఉపయోగించాలి / విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి.
5. హాజర్డ్ లైట్లు విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి.
6. పొగమంచు లేదా కర్వ్ ప్రాంతాల్లో ఓవర్‌టేక్ చేయవద్దు.
7. లైన్ మార్కింగ్‌లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి.
8. వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
9. సడన్ బ్రేకులు లేదా మలుపులు వద్ద వేగాన్ని నివారించాలి.
ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ముందుగానే ప్రయాణం ప్రారంభించండి, తొందరపడొద్దు. హెడ్లైట్లు శుభ్రంగా ఉంచండి. రోడ్డు సూచనలు, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించండి. విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటే, సురక్షిత ప్రదేశంలో ఆగి వేచి ఉండండి.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >