Posted on 2025-12-09 18:53:47
తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లలో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్లు – భవనాల శాఖ కార్యనిర్వాహక అభియంత (ఎస్.ఈ) కె.సర్దార్ సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాలలో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో, స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >