Posted on 2025-12-16 17:42:27
డైలీ భారత్ న్యూస్, రామంతపూర్:రామంతపూర్ భగయత్ సాయి కృష్ణ కాలనీలో నెలకొన్న తీవ్రమైన విద్యుత్ సమస్యలపై భూరాడ బాలకృష్ణ ఈరోజు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఏడీఈని కలిసి వినతి పత్రం అందజేశారు.
కాలనీలో గత కొంతకాలంగా తక్కువ వోల్టేజ్, తరచు విద్యుత్ అంతరాయాలు, సింగిల్ ఫేజ్ సరఫరా కారణంగా గృహోపకరణాలు దెబ్బతినడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, త్రీఫేస్ విద్యుత్ లైన్, అలాగే అవసరమైన విద్యుత్ స్తంభాలు సాంక్షన్ చేసి ఏర్పాటు చేయాలని బాలకృష్ణ ఏ డి ఇని కోరారు.
విద్యుత్ సరఫరా లోపాల వల్ల వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న వేసవి కాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని ఆయన అధికారులకు చెప్పారు . ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా అధికారులు త్వరితగతిన స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >