Posted on 2025-12-16 16:38:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ త్వరలో క్యాబినెట్ మంత్రిగా సేవలు అందించనున్నారు. పార్టీ అధిష్టానం సైతం మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్నట్లు స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ ప్రక్షాళన పై మాట్లాడారు. అయితే తనకు మొదట్లోనే మంత్రి పదవి ఇస్తానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆఫర్ ఇచ్చిన తాను తిరస్కరించడం జరిగిందన్నారు. నాపై అపార నమ్మకంతో అధిష్టానం నన్ను రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించిందని వెల్లడించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టిన తాను ఏడాది పాటు సమర్థవంతంగా పదవికి న్యాయం చేశానని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకోచ్చారు. అయితే హై కమాండ్ మాత్రం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షున్ని మార్చి కొత్తవారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో చర్చ మొదలైంది. అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి అప్పగించకపోవడం మహేష్ కుమార్ గౌడు కు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే హై కమాండ్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఖాళీగా ఉంచినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రిగా పార్టీ సీనియర్ నేతగా, బోధన్ శాసనసభ్యులుగా కొనసాగుతున్న ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కీ ఉమ్మడి జిల్లా నుండి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే రాజకీయ సమీకరణ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి చివరి క్షణంలో మంత్రివర్గం లో చోటు కల్పించలేదు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ లోనూ సుదర్శన్ రెడ్డికి మొండి చేయి చూపడంతో ఆయనతోపాటు, అనుచర వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం సుదర్శన్ రెడ్డికి మద్దతుగా రాజీనామాలకు సిద్ధమయ్యారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పార్టీ అధిష్టానం సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఈ పదవిపై సంతృప్తి లేకపోయినప్పటికీ అయిష్టంగానే బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సుదర్శన్ రెడ్డిని పార్టీ పెద్దలు బుజ్జగించి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కొంత ఊరట చెందిన సుదర్శన్ రెడ్డి ఎట్టకేలకు ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగుతున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి కారణం తెర వెనుక మరో కోణం ఉన్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది. ఉమ్మడి జిల్లా నుండి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో హోం శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది. అయితే తనకు మంత్రి పదవి అవసరం లేదని చెప్పినప్పటికీ హై కమాండ్ నిర్ణయాన్ని శిరసా వహించి మంత్రి పదవిని తీసుకోవాల్సిందే. ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >