| Daily భారత్
Logo




హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓటుకు నోటు, మాంసం,మద్యం

News

Posted on 2025-12-16 21:18:39

Share: Share


హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓటుకు నోటు, మాంసం,మద్యం

మేళ్లచెరువు మండల కేంద్రంలో భారీగా  డంప్ చేసిన నూనె, బియ్యం

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత ఎన్నికలు డబ్బు,మద్యం, మాంసం చుట్టూనే తిరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పాలకీడు, నేరేడు చర్ల, గరిడేపల్లి మట్టంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మందు,మనీ, మాంసంతో ప్రలోభాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసి నిల్వలు చేసుకున్నారని సమాచారం. మేళ్లచెరువు మండల కేంద్రం లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నూనె డబ్బాలు,బియ్యం సంచులు, మందు బాటిల్స్ భారీగా డంప్ చేసినట్లు మేళ్లచెరువు ప్రజలు గుసగుస లాడుతున్నారు. మూడో విడత ఎన్నికల వేళ మంగళవారం రాత్రి పరిస్థితి మరింత దిగజారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులకే కాకుండా వార్డు సభ్యులు కూడా మందు, మనీ పంపిణీలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదట. ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోతారా? లేక ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటారా? ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన ఈ ఎన్నికల తీర్పు రేపు వెలువడనుంది.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >