Posted on 2025-12-16 22:04:28
నూతన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలియజేసిన - మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చెరు: గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం గుమ్మడిదల మండల పరిధిలోని నాలుగు గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాల్ రెడ్డి, కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా ముందుకు సాగుతోందని అన్నారు. నూతన గా గెలుపొందిన సర్పంచి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ లు, మంజుల సత్తయ్య, లావణ్య గోవర్ధన్ రెడ్డి, కొమ్ము శ్రీను, దుర్గా నర్సింగరావు, పార్టీ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, హుస్సేన్, రామప్ప, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి యాదవ్, దయానంద్, శ్రీనివాస్, శంకర్, పోచయ్య, మహేశ్వరి ఉమా రెడ్డి, విట్టల్ రెడ్డి, గోపాల్, యాదిరెడ్డి, మహేష్, ఆంజనేయులు, మంద భాస్కర్ రెడ్డి, ముద్రికచారి, కరుణాకర్ రెడ్డి, సాయి రెడ్డి, వెంకటేశం, విశాల్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,తదితర ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >