| Daily భారత్
Logo




మాజీ ప్రధాని అపర మేధావైన అటల్ బీహారి వాజ్ పేయి జీవితం నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలి

News

Posted on 2025-12-25 18:44:09

Share: Share


మాజీ ప్రధాని అపర మేధావైన అటల్ బీహారి వాజ్ పేయి జీవితం నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: మాజీ ప్రధాని భారతదేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్పేయి నేటితరం  యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతి నీ పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ -

అపర మేధావి కవి అయినటువంటి మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయి  మాటల్లో మృదుత్వం అందరినీ ప్రేమగా పలకరించే స్వభావం కలిగిన వ్యక్తి అని అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చరన్నారు. దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న ఘనత ఆయన కే దక్కుతుందన్నారు. అణు పరీక్షల ఒప్పందం తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గౌరవాన్ని తీసుకువచ్చారని, అదేవిధంగా వాజ్పేయి హయాంలో ఆడపిల్లల చదువు కోసం కీలక నిర్ణయాలు తీసుకొని ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో తెలియచెప్పి పురుషులతో సమానంగా ఆడపిల్లలు చదువుల్లో రాణిస్తారని మహిళల్లో ధైర్యం నింపిన వ్యక్తి ఆయన అని తన ప్రసంగంతో దేశ ప్రజలను ఎందరినో  ఆకట్టుకున్నారని తెలిపారు. గత సంవత్సరం ఆయన 100వ  జయంతి రోజున సుపరిపాలన దినోత్సవం గా ప్రకటించించారన్నారు.  ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ముఖ్యంగా నేటితరం యువత వాజ్పేయి   వ్యక్తిత్వాన్ని పుస్తకాల్లో చదివి ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, బీజేపీ  మాజీ కార్పొరేటర్స్ ,బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >