| Daily భారత్
Logo




భద్రాచలంలో ఘనంగా ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం

News

Posted on 2026-01-11 16:58:46

Share: Share


భద్రాచలంలో ఘనంగా ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్వామి వివేకానంద జయంతి ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలోని భగవాన్దాస్ కాలనీ లో  నేషనల్  యూత్ డే  నిర్వహించారు. ఈ సందర్భంగా  భగవాన్ దాస్ కాలనీలో  ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్  ఘనంగా ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భద్రాచలం సీఐ నాగరాజు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా సేవ్ భద్రాచలం యూత్ అనే సామజిక అవగాహన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. సీఐ నాగరాజు ఆటగాళ్లతో కొంచెం సేపు బాడ్మిటన్ ఆడి ఆటగాళ్ళను ఉత్తేజపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తితో పాటు సమాజం పై అవగాహన పెంచే కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. భద్రాచలం పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మకం లేదా కొనుగోలు చేస్తే తన పర్సనల్ నంబర్‌కు నేరుగా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గంజాయి బాధితుల కు రక్షణ ఫౌండేషన్ ద్వారా కౌన్సిలింగ్ అందించి తగిన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్సై స్వప్న మాట్లాడుతూ, మొబైల్ అడిక్షన్ కూడా యువత భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. సోషల్ మీడియా రీల్స్ వల్ల యువత తప్పుదారి పడే అవకాశం ఉందని, అలాంటి వాటికి దూరంగా ఉండి క్రీడలు, చదువు ద్వారా భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ దిశగా రక్షణ ఫౌండేషన్ చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగ పడతాయని ఆమె పేర్కొన్నారు.  సమాజ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్న డిపో యూత్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుంజా ధర్మారావు,భూక్యా రంగ, చింతిర్యాల రవి,  సున్నం భూలక్ష్మి, డా. మల్లేష్,  టోర్నమెంట్ నిర్వాహకులు కుంజా సంతోష్, తాళ్ళ రమేష్, తాళ్ళ నాగరాజు, బోళ్ళ కృష్ణ, శీలం నాగరాజు, బత్తుల రమేష్, నరేందర్, బాలు, ఆనంద్, తాళ్ళ శివ, సున్నం వినోద్, కణితి నవీన్, యాలం సురేష్, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >