| Daily భారత్
Logo




నిజామాబాద్ ప్రగతి పథంలో మరో ముందడుగు

News

Posted on 2026-01-11 17:31:01

Share: Share


నిజామాబాద్ ప్రగతి పథంలో మరో ముందడుగు

60 కోట్లతో అభివృద్ధి పనులకు నగరంలోని వినాయక్ నగర్ లో శంకుస్థాపన చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ లు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో మరియు6 కోట్లతో  33/11 కె వి సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. చేపట్టిన పనులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లు ఘనంగా శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున కేటాయించి, నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నిజామాబాద్ పట్టణంలో లో వోల్టేజ్ పట్టణంలో విద్యుత్ సమస్యలు లేకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ​ఈ సందర్భంగా జరిగిన  సభలో మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యాలన్నారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా 60 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు కోటి రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రోడ్ల నిర్మాణం, మరియు వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ​మాది ప్రజా పాలన మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం" అని చెబుతూ.. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నగరాన్ని ఒక "మోడల్ సిటీ" గా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని ఆయన కోరారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, నిజామాబాద్ నా సొంత గడ్డ, ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా సంకల్పంఅని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. 60 కోట్లు అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ​అవినీతి రహిత పాలన అందిస్తాం

గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కంటే, పారదర్శకమైన మరియు వేగవంతమైన పాలనను కాంగ్రెస్ అందిస్తోందని స్పష్టం చేశారు. మనం చేస్తున్న ఈ 60 కోట్ల అభివృద్ధి పనులే మన విజయానికి పునాది" అని పేర్కొంటూ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ​

ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నుడా చైర్మన్ కేశవ వేణు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, అరికెల నర్సారెడ్డి, రత్నాకర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >