| Daily భారత్
Logo




క్రీడలతో మేధస్సు పెరుగుతుంది

News

Posted on 2026-01-11 19:30:53

Share: Share


క్రీడలతో మేధస్సు పెరుగుతుంది

మత్తు పానీయాలను మానేద్దాం, క్రీడల వైపు వెళ్దాం

ఆర్ పి సూపర్  స్పెషాలిటీ హాస్పిటల్  ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమయపాలనతో క్రీడలు ఆడితే  యువతి, యువకుల్లో మేధస్సు పెరిగి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఎంతో దోహదం చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —

యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, విజయం సాధించేందుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రికెట్ ఆటలో గెలుపు-ఓటములు సహజమని, ఓడినవారు లోపాలు తెలుసుకుని మరింత కృషితో ముందుకు సాగాలని సూచించారు. గెలిచిన వారు కూడా మరిన్ని విజయాలు సాధించేలా మెలకువలు అలవర్చుకోవాలని అన్నారు.

మత్తుపదార్థాల నిర్మూలనపై రాష్ట్ర చర్యలు

యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ టీమ్ ఏర్పాటు చేసిందని, యువత క్రీడల వైపు ఆసక్తి పెంచితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చని చెప్పారు.

స్కిల్ & స్పోర్ట్స్ యూనివర్సిటీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఒలింపిక్స్‌లో తెలంగాణ యువత రాణించాలని స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన చేశారని ఎమ్మెల్యే వివరించారు. చిన్న దేశాలు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ తెస్తుంటే మన రాష్ట్రం నుంచి కూడా ఒలింపిక్ లో ఆటగాళ్లు ఆడాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం సీఎం కప్, ఇంటర్ జోన్ టోర్నమెంట్లు, పాఠశాలలు–కాలేజీల్లో గేమ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాల స్థలంలో క్రీడా స్టేడియం మంజూరు అయ్యిందని, రానున్న రోజుల్లో రూరల్ యువత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేలా అవకాశాలు పెరుగుతాయని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌ను ఎమ్మెల్యే అభినందిస్తూ 

యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించడం గొప్ప సేవ అని కొనియాడారు. గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసి, ఓడిన వారికి కూడా ప్రోత్సాహం తెలిపారు.

కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, గంగదాస్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పోలసాని శ్రీనివాస్ శాంసన్, రామచందర్ గౌడ్, డిచ్‌పల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు వాసుబాబు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >