| Daily భారత్
Logo




అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

News

Posted on 2026-01-11 20:49:15

Share: Share


అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అధికారంలో ఉన్నప్పుడు మనమేం చేశామనేది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు,కానీ అధికారంలో ఉన్నప్పుడు మనమేం చేశామనేది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్‌ మున్సిపల్‌ కార్డిరేషన్‌ మాజీ మేయర్‌ లతా ప్రేమ్‌ గౌడ్‌, ఆమె భర్త హస్తం పార్టీకి రాజీనామా చేసి, బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.ఆదివారం శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇంచార్జి కార్తీక్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇవాళ ప్రజలు మన మాజీ సీఎం కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు కారణం అని అన్నారు.రేవంత్ రెడ్డి ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్‌సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్నీ అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని అన్నారు.రేవంత్ రెడ్డి రైతులను, రైతు కూలీలను, కౌలుదారులను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరినీ మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని అన్నారు.పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మని చెప్పుకుంటూ, స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటున్నారని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని అన్నారు. రాజేంద్రనగర్‌కు వచ్చే ఏర్పాటు చేసిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినందుకు సీఎంతో కలిసి పోయిండా అనే విషయం చెప్పాలని కేటీఆర్ అన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >