| Daily భారత్
Logo




వాకింగ్ చేయడం అంటేనే సర్వరోగ నివారిణి

News

Posted on 2026-01-11 21:17:28

Share: Share


వాకింగ్ చేయడం అంటేనే సర్వరోగ నివారిణి

కరోనా మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ వెల్లడి

డైలీ భారత్, నిజామాబాద్:వాకింగ్ చేయడం సర్వరోగ నివారిణి అని ప్రతిరోజు తమతమ దిన చర్యలో అరగంటసేపు వాకింగ్కు సమయం కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవగాహన పెరిగిందని అందుకే ఇదివరకంటే అంటే కరోనా రాక ముందు కంటే ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వాకింగ్, వ్యాయామం  లాంటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతం, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం NUDA ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.9 లక్షల నిధులతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్‌కు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,

వాకింగ్ అనేది సర్వరోగ నివారిణి అని, ఏ వృత్తుల వారైనా, వ్యాపారవేతలైన, రాజకీయ నేతలైనప్పటికీ వారి వారి నిత్యజీవితంలో వివిధ రకాల బిజి షెడ్యూల్ ఉన్నప్పటికీ వాకింగ్ కొరకు ప్రతి  రోజు కనీసం అరగంట వాకింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. ముఖ్యంగా కరోనా తరువాత ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పాలిటెక్నిక్ మైదానానికి ప్రతిరోజూ 5 వేల నుంచి 10 వేల మంది వరకు వాకింగ్ కోసం వస్తుంటారని, అలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాకింగ్ ట్రాక్ నిర్మాణం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే గత 12 సంవత్సరాలుగా నిరంతరం వాకింగ్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అశోక్ అని ఎక్స్ సర్వీస్ మాన్ తన శక్తి మేరకు సహకరిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని, ఆరోగ్యంపై ఉన్న అవగాహనతో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గారు కొనియాడారు. ప్రభుత్వం ద్వారా రూ.9 లక్షల నూడ నిధులు మంజూరైనప్పటికీ, అవి సరిపోకపోతే తన వంతుగా ఉడతా భక్తిగా సహాయం చేసి, శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో వాకింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన  హామీ ఇచ్చారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, సరైన కోచింగ్ లేకున్నా జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. అదే మన జిల్లా క్రీడాకారులకు ఉన్న గొప్పతనం అని ఆయన అన్నారు. పాత కలెక్టరేట్ మైదానం, నగరంలోని స్టేడియంలు, ఇతర క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి ఇందూరు క్రీడాకారుల ప్రతిభను దేశవ్యాప్తంగా చాటిచెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నూడ చైర్మన్  కేశవేణు, వాకింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >