Posted on 2026-01-11 15:49:32
జూలూరుపాడు మండలం సూరారం గ్రామంలో భార్యాభర్తల మనస్పర్ధలతో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం, సూరారం గ్రామానికి చెందిన, భానోతు నాగరాజు కూలి పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు తన భార్యతో ఉన్న మనస్పర్ధల కారణంగా, గత కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తనకున్నటువంటి వ్యక్తిగత సమస్యల వలన మరియు ఒంటరితనాన్ని భరించలేక, భార్యతో ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా మనస్థాపం చెంది, తీవ్ర మనోవేదనకు గురయ్యాడు సూరారం గ్రామ శివారుణ గల తన చేను వద్దకు వెళ్లి టేకు చెట్టుకు ఎడ్ల బండి పలుకుతాడుతో ఉరి వేసుకుని మృతి చెందినాడు. తన కుమారుడు నాగరాజు మరణముపై తనకు అనుమానం ఉన్నదని, సమగ్ర స్థాయిలో దర్యాప్తు మరియు విచారణ జరిపి న్యాయం చేయవలెనన్న మృతుడి తల్లి బానోతు జమ్మ ఫిర్యాదు పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గజ్జల శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >