| Daily భారత్
Logo




రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదంలో హత్యాయత్నం

News

Posted on 2026-01-12 08:08:11

Share: Share


రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదంలో హత్యాయత్నం

పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదంలో హత్యాయత్నం

ముగ్గురు నిందితుల అరెస్ట్ – ఆయుధాల స్వాధీనం

కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాహాబాజ్ అహ్మద్

డైలీ భారత్, కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదానికి సంబంధించి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు అని ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాహాబాజ్ అహ్మద్ తెలిపారు.

అరెస్టు అయిన నిందితులు:

A-1 మీసాల సురేష్, తండ్రి నర్సింగరావు, వయసు 50 సంవత్సరాలు, ఎస్సీ–పైడి కులం, పద్మనాభపురం గ్రామం, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ.

A-2 మీసాల చిన్నారావు, తండ్రి (లేట్) కల్లియాడు, వయసు 60 సంవత్సరాలు, ఎస్సీ–పైడి కులం, పద్మనాభపురం గ్రామం.

A-3 మీసాల మోహనరావు, తండ్రి (లేట్) కల్లియాడు, వయసు 69 సంవత్సరాలు, ఎస్సీ–పైడి కులం, పద్మనాభపురం గ్రామం.

అరెస్ట్ పెండింగ్ నిందితుడు:

A-4 మున్నా @ సుదీప్

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

ఒక తుపాకి (టపాంచా)

04 రౌండ్లు

03 కత్తులు

02 కర్రలు

ఒక టీవీఎస్ జూపిటర్ స్కూటీ (నెం. AP39 DP 4937)

03 స్మార్ట్ ఫోన్లు

A-1 నుండి A-3 లు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని పద్మనాభపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. A-2 మరియు A-3 లు A-1 కు చిన్నాన్నలు కాగా, A-4 A-1 కు బావమరిది. A-1 పలాస రైల్వే స్టేషన్‌లో గత సుమారు 13 సంవత్సరాలుగా రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్ మరియు టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్టులను నిర్వహిస్తూ వచ్చాడు.డిసెంబర్ 2025 లో జరిగిన టెండర్లలో ఈ రెండు కాంట్రాక్టులు వీరికి దక్కకపోవడంతో, కొత్తగా టెండర్ పొందిన వారికి 09-01-2026 రాత్రితో టూ వీలర్ పార్కింగ్ షెడ్ అప్పగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, కొత్త టెండర్ పొందిన ఫిర్యాది మరియు అతని అనుచరులు పార్కింగ్ షెడ్‌ను శుభ్రపరుస్తుండగా, సబ్-కాంట్రాక్ట్ పొందాలనే ఉద్దేశంతో A-1 నుండి A-4 లు కలిసి ఫిర్యాది మరియు అతని అనుచరులను హతమార్చాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో A-2 తుపాకితో కాల్చేందుకు ప్రయత్నించగా, A-3 కత్తితో ఫిర్యాది స్నేహితుడిపై దాడి చేశాడు. A-1 మరియు A-4 లు కత్తులు, కర్రలతో దాడి చేశారు.

దీనిపై ఫిర్యాది 11-01-2026 న కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోసంగిపురం జంక్షన్ సమీపంలో ఈ రోజు సాయంత్రం 4 30 గంటలకు A-1 A 2,A-3 లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న A-4 ను అరెస్టు చెయ్యాల్సింది ఉంది.ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాహాబాజ్ అహ్మద్ తెలిపారు.


#Dgp Andhra Pradesh #Andhra Pradesh #Police Srikakulam District Police

Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >