| Daily భారత్
Logo




ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

News

Posted on 2026-01-14 17:45:54

Share: Share


ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

25న బహిరంగ సభకు మహిళలు కదిలి రావాలి 

ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత 

డైలీ భారత్, వైరా: హైదరాబాద్ లో జరిగే ఐద్వా 14వ  జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా జనవరి 25న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే బహిరంగ సభకు మహిళలు భారీగ తరలి రావాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని రెచర్ల బజార్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ నాయకురాలు మాడపాటి సుజాత ఐద్వా జెండాను ఎగురవేశారు. అనంతరం సభలో గుడిమెట్ల రజిత మాట్లాడుతూ మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, వివక్షతకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం ఐద్వా పోరాడుతుందని అన్నారు. కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, విద్యా, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు మహిళలు ఐద్వా చీర ధరించి భారీగా తరలివచ్చి ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి, వైరా డివిజన్ కమిటీ సభ్యురాలు కంసాని మల్లికాంబ, కట్ల ఆశ, మాడపాటి రమ, పువ్వాడ సరోజిని, గూడపాటి శ్రీజ, గూడపాటి మయూక, దర్గాబి, రేచర్ల రాణి, కొమరనేని భానుమతి, పొడపాటి లక్ష్మి, ఐలూరి పద్మ  తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >