Posted on 2026-01-14 18:45:43
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో ‘కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్’ ఘనంగా నిర్వహణ
భోగి మంటలు, రంగురంగుల పతంగుల సందడితో ఉత్సాహంగా గడిపిన పోలీస్ కుటుంబాలు
అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేసిన జిల్లా ఎస్పీ
డైలీ భారత్, కామారెడ్డి: భోగి & సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో “కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్” (పతంగుల పండుగ) ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు.
కార్యక్రమం ప్రారంభంలో జిల్లా ఎస్పీ సంప్రదాయబద్ధంగా భోగి మంటను వెలిగించి, జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన పతంగుల పండుగలో జిల్లా అడిషనల్ ఎస్పీ, కామారెడ్డి ఏఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇలాంటి వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి ఈ తరహా కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
అదేవిధంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనీస్ మాంజా లేదా నైలాన్ మాంజా వాడకూడదని స్పష్టం చేశారు. అవి పక్షులకు మాత్రమే కాకుండా, వాహనదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారతాయని హెచ్చరించారు. ప్రజలంతా కేవలం కాటన్ త్రెడ్ (నూలు దారం) మాత్రమే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
పండుగలు ఆనందాన్ని పంచాలి గానీ విషాదాన్ని మిగల్చకూడదని, సంప్రదాయాలను గౌరవిస్తూ భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, కృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >