| Daily భారత్
Logo




రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

News

Posted on 2026-02-23 20:05:30

Share: Share


రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన పోలీస్ క్రీడాకారులకు అభినందన సభ

విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న పతకాలను సాధించడం అభినందనీయం.

డైలీ భారత్ వరంగల్: మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ అభినందన కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా హకీ క్రీడాకారులు సంయుక్తంగా కలసి వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హకీ జెర్సీని బహుకరించడంతో పాటు, ఈ రాష్ట్ర స్థాయిలో  క్రీడల్లో టెబుల్ టెన్నిస్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా సీపీ పతకాన్ని అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ క్రీడాకారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా పతకాలను గెలిచిన క్రీడాకారులతో పాటు, ఈ క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులకు సైతం అభినందనలు తెలియజేస్తూ, వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు ఈ రాష్ట్రా స్థాయిలో క్రీడల్లో అద్బుత ప్రదర్శనతో గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలను కైవసం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని. ఇదే ప్రదర్శన రాబోవు రోజుల్లో కనబర్చాలని, ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో పతకాలను సాధించేందుకుగా ముమ్మరంగా సాధన చేయాలని, క్రీడల్లో రాణించే వారికి తప్పక సహకారం అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.


ఈ కార్యక్రమములో డిసిపిలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసిపిలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఇన్స్‌స్పెక్టర్  శుకూర్, ఆర్.ఎస్.ఐ శరత్, మణి కృష్ణ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.

Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >