| Daily భారత్
Logo




డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను నివారించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

News

Posted on 2026-02-27 13:33:48

Share: Share


డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను నివారించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

నాలుగు వందల మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు

మూడు వందల మందికి కంటి అద్దాలు అందజేత

డైలీ భారత్, వరంగల్: డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అరైవ్ అలైవ్" రెండవ విడతలో వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ములుగు రోడ్డులోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రిజినయన్ ఐ హస్పటల్, శరత్ ఐ హస్పటల్, కీర్తి హస్పటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారు నాలుగు వందలకుపై ఆటో డ్రైవర్లు కంటి పరీక్షలు నిర్వహించుకోగా, మూడు వందలకుపై డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేయడం జరింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్య మంత్రి "అరైవ్ అలైవ్" ప్రారంభించడం జరిగిందని రోడ్డు నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని, ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాలకు చెందిన డ్రైవర్లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్య స్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై వుందని, ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని, రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు సైతం నిరంతం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం క్షేమకరమని అదే విధంగా కంటి చూపు బాగుంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలను గుర్తించడం ద్వారా సురక్షితంగా డ్రైవింగ్ చేయగలమని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేసారు.

ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డిసిపి ప్రభాకర్ రావు, ఏసిపిలు సత్యనారయణ,నర్సింహరావు, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు సుజాత, సీతా రెడ్డి,వెంకన్న, మట్టెవాడ ఇన్స్ స్పెక్టర్ కరుణాకార్, డాక్టర్లు శ్రీదేవి,డా.దిలిప్,రంజన్ కుమార్ వారి సిబ్బంది పాల్గోన్నారు.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >