| Daily భారత్
Logo




సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

News

Posted on 2026-02-28 17:14:48

Share: Share


సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు  ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్ల యందు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్  నిర్వహించడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమానికి 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్  ను పరిచయం చేశారు. అనంతరం కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా నూతన ఆలోచనలను, ప్రశ్నించడం ద్వారా శాస్త్రీయ ఆలోచన పెంపొందుతుందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విజ్ఞాన శాస్త్రం మానవ అభివృద్ధికి మూలం అని ఈరోజు మనం పొందుతున్న అధునాతన టెక్నాలజీ పూర్తిగా సైన్స్ అభివృద్ధి ఫలాలు అని తెలిపారు.  మూఢనమ్మకాలు నమ్మవద్దని ఏదైనా శాస్త్రీయంగా పరిశీలించి నిజనిర్ధారణ చేయాలని తెలియజేశారు. బయట దొరికే ఆహార పదార్థాలు, వాటి వల్ల జరిగే నష్టాలు ముఖ్యంగా శీతల పానీయాల వల్ల మన శరీరాన్ని అది ఎంత కృంగదీస్తుందో సవివరంగా తెలియజేశారు. ఎగ్జిబిట్స్ తయారీలో పిల్లలు ఎలా కష్టపడ్డారో తెలియజేస్తూ, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు తూముల తిరుపతి మరియు రాజగోపాల్ రెడ్డి కృషిని అభినందించారు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న శాస్త్రీయ అభివృద్ధి, చంద్రయాన్ 2 విజయవంతం కావడంలో శాస్త్రజ్ఞుల కృషిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. 

ఈ  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బైరి రవీందర్,T తిరుపతి, వడాల రవీందర్, రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ , రాజేశం , డేవిడ్సన్ , రమాదేవి, రాధిక, నిరోషా , విజయలక్ష్మి  ,  CRP దేవేందర్ , అనిల్, రాజు,పాల్గొన్నారు.

Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >