Posted on 2026-03-02 15:52:10
అన్ని మౌలిక వసతులు కల్పించి, వినియోగంలోకి తీసుకురావాలి.
మహిళా సమాఖ్య భవనాలను త్వరితగతిన నిర్మించాలి.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై కలెక్టర్ సమీక్ష
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ, హెల్త్ సబ్ సెంటర్స్ తుది దశ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, 15 ఆర్థిక సంఘం నిధులు, ఎన్హెచ్ఎం, డీఎంఎఫ్టీ ఇతర నిధులతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, ప్రహరీల నిర్మాణాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో నిర్మాణ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలో ఆయా శాఖల జిల్లా అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాలకు మంజూరు చేసిన మహిళా సమాఖ్య భవనాల పనులను మూడు రోజుల్లో మొదలుపెట్టాలని, ఇప్పటికే ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా మహిళా సమాఖ్య భవన పనులను ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేసి అందు బాటులోకి తీసుకురావాలని సూచించారు. తుది దశలో ఉన్న గ్రామపంచాయతీ, అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా భవనాల్లో నీటి, విద్యుత్, టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. వివిధ గ్రామాల్లో ఇంకా ప్రారంభించని పనులపై ఆయా మండలాల ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా సమస్యలను పరిష్కరించాలని, త్వరితగతిన పనులను పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని ఏపీవోలు, పంచాయతీరాజ్ శాఖ ఏఈలతో సమావేశం ఏర్పాటు చేయాలని, తమ మండలాలకు ఏఏ నిర్మాణాలు మంజూరయ్యాయి? వాటి ప్రస్తుత పరిస్థితి పై ఆరా తీయాలని, పనుల పురోగతిపై సమాచారం తెలుసుకోవాలని ఆదేశించారు. తమ మండలాలలో నిర్మిస్తున్న భవనాలు, టాయిలెట్లు ఇతర అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఈఈ, డీఆర్డీఓ, డీడబ్ల్యూఓ, డీఈఓ తమ పరిధిలో పనులపై తమ అధికారులు, సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం డస్ట్ బిన్, పిల్లలు చేతులు కడుక్కునేందుకు హ్యాండ్ వాష్ అందుబాటులో పెట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులను పక్కాగా చేయాలని, దీనిపై జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకునేలా ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ప్రతి అభివృద్ధి నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ఆయా శాఖల జిల్లా అధికారులు సమీక్షించాలని, వాటి పురోగతిని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ గీత, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, ఎంపీడీవోలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >