| Daily భారత్
Logo




వరంగల్‌లో నిరుద్యోగ సమస్యల పట్ల పార్లమెంట్‌లో ప్రస్తావించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

News

Posted on 2026-03-16 18:12:55

Share: Share


వరంగల్‌లో నిరుద్యోగ సమస్యల పట్ల పార్లమెంట్‌లో ప్రస్తావించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

పరిశ్రమలు లేక యువత వలసలు..

వరంగల్ యువతకు ఉపాధి కల్పించాలి..

సీజనల్ కూలీల ఉపాధి, రక్షణపై కేంద్రాన్ని ప్రశ్నించిన వరంగల్  ఎంపీ డా. కడియం కావ్య..

డైలీ భారత్, వరంగల్/ న్యూఢిల్లీ: వరంగల్ జిల్లాలో యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్ సహా ఇతర మహానగరాలకు వలసలు పెరుగుతున్న అంశాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రస్తావించారు. పరిశ్రమల అభివృద్ధి లోపం, స్థానికంగా తగిన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యువత, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు..

ప్రధానంగా 15–29 ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగం ఎంత మేర ఉందో, ఈ వలసలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వివరాలు ఇవ్వాలని ఎంపీ డా.కడియం కావ్య కేంద్రాన్ని కోరారు. అలాగే వ్యవసాయ పనులు లేని ఆఫ్‌ సీజన్ సమయంలో సీజనల్ వ్యవసాయ కూలీలకు ఆదాయం, భద్రత కల్పించేందుకు ప్రత్యేక పథకాలు ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు..

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు  కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో యువత నిరుద్యోగం 2017–18లో 23.3 శాతం ఉండగా 2023–24 నాటికి 16.6 శాతానికి తగ్గిందని తెలిపారు. ఇదే సమయంలో వర్కర్ పాప్యులేషన్ రేషియో 32 శాతం నుంచి 40.7 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగం 17.8 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గిందని, ఉపాధిలో ఉన్న వారి శాతం 31.4 నుంచి 41.7కు పెరిగిందని మంత్రి వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఇండియా మిషన్, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY), నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే సాధారణ పథకాలతో మాత్రమే వరంగల్ ప్రాంతంలోని ప్రత్యేక సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీ డా. కడియం కావ్య అభిప్రాయపడ్డారు. పరిశ్రమల కొరత, వ్యవసాయ ఆధారిత ఉపాధి సీజనల్‌గా ఉండటం వల్ల యువత వలసలు ఆగడం లేదని పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతానికి ప్రత్యేక పరిశ్రమలు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు..


#PostByAdmin  #cmrevanthreddy #kadiyamkavya #warangal #MemberOfParliament #youth #employment

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >