Posted on 2026-03-20 07:53:58
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఉత్తర ప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్‌లో జరిగిన “బ్లూ డ్రమ్ హత్య కేసు” తరహాలోనే మరో ఘటన జరగబోతుందనే అనుమానం భర్తలో భయాన్ని రేకెత్తించింది. చివరకు తన ప్రాణాల కోసం భార్యను ఆమె ప్రియుడితోనే పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.పోలీసుల వివరాల ప్రకారం.. బులందేశ్వర్‌కు చెందిన రాజ్‌కుమార్ భార్యకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గతంలో పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి, తన ఆరు నెలల చిన్నారిని భర్త దగ్గర వదిలి, ప్రియుడితో నెలరోజులు గడిపింది. ఈ ఘటనతో అనుమానం పెరిగిన రాజ్‌కుమార్ పలుమార్లు ప్రశ్నించినా, ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది.ఒకరోజు ఆమె ఫోన్‌ను చెక్ చేసిన రాజ్‌కుమార్‌కు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో నగ్న చిత్రాలతో పాటు “సిమెంట్, డ్రమ్ స్టోరీ” పేరుతో హత్యలకు సంబంధించిన కథనాలు షేర్ చేయడం గమనించాడు. ఈ విషయాలు చూసి తనను కూడా అదే విధంగా హత్య చేసే ప్లాన్ ఉందేమోనని రాజ్‌కుమార్ తీవ్ర భయానికి గురయ్యాడు.తక్షణమే పోలీసులను ఆశ్రయించిన రాజ్‌కుమార్, జరిగిన విషయాన్ని వివరించాడు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన పంచాయతీలో ఆ మహిళ తన భర్తతో ఉండనని, ప్రియుడితోనే వెళ్లాలని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజ్‌కుమార్ చివరకు భార్యను ఆమె ప్రియుడితో పంపించేందుకు అంగీకరించాడు.ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసుల ప్రభావం ప్రజల్లో ఎంతటి భయాన్ని కలిగించిందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >