| Daily భారత్
Logo




ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం

News

Posted on 2026-03-28 11:27:35

Share: Share


ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం

అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు.

ఆశ వర్కర్ల పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలి.

సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈరోజు మార్చి 28న ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ మహాధర్న ను భగ్నం చేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆశా వర్కర్లను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించడాన్ని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి  కోడం రమణ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా సిరిసిల్లలోని సుందరయ్య నగర్ , అంబేద్కర్ నగర్ PHC ల ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్భందించిన వారిని కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల జరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలో కి వస్తే ఆశా వర్కర్ల కి నెలకి 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని,పని భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆశాలకు రావలసిన  పారితోషకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన , ధర్నా తెలియజేసే హక్కు కల్పిస్తున్నామని చెబుతూనే మరోవైపు శాంతియుతంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాకు వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసుల చేత నిర్బంధించడం అన్యాయం అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వానికి ఆశ వర్కర్ల పైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ కేటాయించాలని లేకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు , ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అరెస్ట్ అయిన వారిలో లావణ్య , చంద్రకళ , రజిత , నిర్మల , మమత , లక్ష్మి , గీత , స్వప్న , జ్యోతి , బాలలక్ష్మి , అనిత తదితరులు ఉన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >