| Daily భారత్
Logo




ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్

News

Posted on 2026-03-28 21:49:18

Share: Share


ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్

డైలీ భారత్, కోరుట్ల: సాధార‌ణంగా క‌రెంటు బుల్లు క‌ట్ట‌క‌పోతే, బ‌కాయిలు ఎక్కువైతే విద్యుత్ క‌నెక్ష‌న్ క‌ట్  చేస్తూ ఉంటారు. ఏవైనా ప‌న్నులు క‌ట్టాల్సి ఉంటే పంచాయ‌తీలు, మున్సిపాలిటీల నుంచి క్లియ‌రెన్సులు నిలిచిపోతుంటాయి. ఆ మున్సిపాలిటీ ప‌రిధిలో ఇంటిప‌న్ను క‌ట్ట‌క‌పోతే అధికారులు స‌రికొత్త నిబంధ‌న తీసుకొచ్చింది. మొదట మున్సిపల్ నుండి వినియోగించుకుంటున్న సేవలను నిలిపివేస్తామని అప్పటికి ఇంటిప‌న్ను చెల్లించ‌క‌పోతే క‌రెంటు క‌ట్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో ఇంటి ప‌న్ను వ‌సూళ్ల కోసం అధికారులు అవ‌సంభిస్తున్న ఈ కొత్త ప‌ద్ధ‌తి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారం విద్యుత్ శాఖకు మాత్రమే ఉంటుంది.

అయితే మున్సిపల్ పన్ను బకాయిల కోసం అధికారులు తీసుకున్న నిర్ణ‌యాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇంటి పన్ను వసూలు చేసిన మున్సిపల్ అధికారులు 100 శాతం ఇంటి పన్ను వసూలు కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు చెప్పారు. కాగా, గృహలక్ష్మి పథకం అమలవుతున్న తమ ఇండ్ల కరెంట్ కట్ చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొండి బాకీ వసూలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో ఆ ఇంటి విద్యుత్, వాటర్ కలెక్షన్లు కట్ చేస్తున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. కరెంట్ కట్ చేసే పరిస్థితి రాకుండా అందరు సహకరించి ఇంటి పన్నులను చెల్లించాలని పట్టణ ప్రజలను క‌మిష‌న‌ర్‌ కోరారు

                       మున్సిపల్ కమిషనర్

బాధితురాలు

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >