Posted on 2026-03-28 22:33:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను శనివారం రోజున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో రికార్డులను, స్కానింగ్ సెంటర్ల మిషన్ లను పరిశీలించారు. ఫారం ఎఫ్ ఆడిట్లను పరిశీలించి గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు సంతకాలు తీసుకొని, గర్భిణీ స్త్రీ స్కానింగ్ వివరాల ఫిలింను జత పరచాలని సూచిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీ స్త్రీ కి ఆడ మగ (లింగ నిర్ధారణ) అని సైగల ద్వారా తెలియజేసిన స్కానింగ్ సెంటర్ లను సిజ్ చేస్తామని, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని స్కానింగ్ నిర్వాహకులను హెచ్చరించారు, రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహించినట్లయితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, నవీన పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >