| Daily భారత్
Logo




ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..

News

Posted on 2026-04-06 13:06:45

Share: Share


ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ లో తీవ్ర భ‌ద్ర‌తా లోపం జ‌రిగింది. ఓ దుండ‌గుడు త‌న కారుతో అసెంబ్లీ లోప‌లికి ప్ర‌వేశించాడు. గేటును కారుతో ఢీకొట్టి అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోకి వెళ్లాడు. గేటు నెంబ‌ర్ 2 వ‌ద్ద మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కారుకు యూపీ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ ఉన్న‌ది. ఆ కారులో వ‌చ్చిన డ్రైవ‌ర్‌.. అసెంబ్లీ స్పీక‌ర్ విజేంద‌ర్ గుప్తా ఆఫీసు దిశ‌గా వెళ్లాడు. అక్క‌డ నుంచి వెనుదిరిగే ముందు అత‌ను ఫ్ల‌వ‌ర్ బొకే ఉంచిన‌ట్లు ఢిల్లీ సెక్ర‌టేరియేట్ అధికారి తెలిపారు. ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం జ‌రిగిన‌ట్లు అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సెక్యూర్టీ ఉల్లంఘ‌న ఘ‌ట‌న కింద దీన్ని భావిస్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ అసెంబ్లీ సెష‌న్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలో బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ ప్ర‌స్తుతం అక్క‌డ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ఫ్ల‌వ‌ర్ బొకేలో ఎటువంటి ప‌దార్ధం లేద‌ని తేల్చారు.

కారును ట్రేస్ చేసే పనిలో ఢిల్లీ పోలీసులు

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >