| Daily భారత్
Logo




సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

News

Posted on 2026-04-11 05:21:32

Share: Share


సిరిసిల్ల కలెక్టరేట్  బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో, సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు వద్ద కొత్తగా 33/11కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ అనుమతులు మంజూరు చేసిందని రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి తెలిపారు. ఈ సందర్బంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మొత్తం రూ. 2,81,48,000/- (రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు) నిధులు కేటాయించారు. ఈ కేంద్రంలో 1x5.0 ఎంవిఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఈ సబ్‌స్టేషన్ నుండి 4 కొత్త 11కేవీ ఫీడర్లను (ఫీడర్-1, 2, 3,  4) నిర్మించనున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ , లోడ్ విపరీతంగా పెరుగుతోంది.  క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈ  తెలిపారు.

ఈ కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా సిరిసిల్ల మండలంలోని వేలాది మంది వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన  విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >