| Daily భారత్
Logo




ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

News

Posted on 2026-04-11 17:50:31

Share: Share


ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

డైలీ భారత్, కామారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కామారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో శనివారం పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్సీని వెంటనే వేసి అమలు చేయాలని, సీపీఎస్​ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.

రిటైర్డ్ ఉద్యోగస్థులందరికీ మొత్తం బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈహెచ్​ఎస్​ను వెంటనే అమలుచేయాలని, టెట్​ను రద్దు చేయాలన్నారు. ఈ నెల 17 న అన్ని మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి తహశీల్దార్లకు వినతి పత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే నెల 5 న మున్సిపాలిటీల ముందు వేలాదిగా తరలి వచ్చి ధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యల తీవ్రతను తెలియజేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ డాక్టర్​ దేవేందర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కుషాల్, నాయకులు ప్రవీణ్, కలీమొద్దీన్, దేవులా, సుల్తానా, యాదయ్య, రాజు, ఎల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు, బషీర్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >