Posted on 2026-04-13 15:39:44
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో (Cr. No. 434/2024) నాంపల్లి XII అదనపు సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి టి. అనిత నిందితుడికి సహజ మరణం వరకు కఠిన కారాగార జీవితం (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్) విధిస్తూ, భారీ జరిమానా కూడా విధించారు.
2024 మే 11న నమోదైన ఈ కేసులో బాధితురాలు కర్నూలు జిల్లా బాలికా విద్యాలయంలో 9వ తరగతి చదువుతోంది. సెలవుల సమయంలో ఇంటికి వచ్చిన ఆమె, మే 10న కడుపునొప్పితో అమీర్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
పోలీసుల దర్యాప్తులో, వారి ఇంటి ఎదురుగా నివసించే మడకారు శ్రీనివాసులు అనే వ్యక్తి, బాధితురాలు తన కుమారుడితో ఆడుకోవడానికి వచ్చిన సమయంలో లైంగిక దాడికి పాల్పడినట్లు, దాని ఫలితంగా ఆమె గర్భవతి అయినట్లు నిర్ధారణ అయ్యింది.
నిందితుడు: మడకారు శ్రీనివాసులు (26)
నివాసం: దాసరాం బస్తీ, బి.కె గూడ, హైదరాబాద్
స్వస్థలం: గుంతకల్, అనంతపురం
శిక్ష:
POCSO చట్టం సెక్షన్ 5(j)(ii)(l) r/w 6 ప్రకారం,
సహజ మరణం వరకు కఠిన కారాగార జీవిత ఖైదు
జరిమానా: ₹10,000/-
(చెల్లించకపోతే అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష)
పరిహారం:
బాధితురాలికి ₹10,00,000/- చెల్లించాలని కోర్టు ఆదేశం
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ఎస్.ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >