Posted on 2026-04-13 20:45:38
ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలింపు
డైలీ భారత్, మహబూబాబాద్/కొత్తగూడ : ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన కొత్తగూడ మండలం మాసంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.మాసంపల్లి గ్రామానికి చెందిన లావుడ్య వాగా కుమార్తె లావుడ్య కావ్యశ్రీ (9) సోమవారం తన ఇంటి మేడ (స్లాబ్) పై ఆడుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి పైభాగం నుండి వెళ్తున్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలను బాలిక గమనించకుండా పట్టుకుంది.విద్యుత్ తీగలు తాకగానే బాలికకు తీవ్రంగా షాక్ కొట్టింది.
షాక్ ప్రభావంతో బాలిక స్లాబ్ పై నుండి ఒక్కసారిగా కిందపడిపోయింది.
దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్ గోవర్ధన్, ఈఎంటి (EMT) రాంబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, మెరుగైన వైద్యం కోసం అత్యంత వేగంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి త్వరగా కోలుకోవాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >