Posted on 2026-04-13 18:03:35
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం..
అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని
ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి..
రోడ్డు భద్రత వాల్ పోస్టర్ ను అవిష్కరించిన జిల్లా కలెక్టర్
డైలీ భారత్, కరీంనగర్: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.
సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడప వద్దన్నారు. మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. టూ వీలర్ వాహనదారులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. పాదచారులు కూడా జాగ్రత్తగా రోడ్లు దాటాలని, నిర్దేశిత జీబ్రా క్రాసింగ్‌లను వినియోగించాలని చెప్పారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన సుభాష్ నగర్ లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు ఆటో రిక్షా డ్రైవర్లకు మెడికల్ చెకప్ నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పురుషోత్తం, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి ఎంవీఐ రవికుమార్ రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ మెంబర్, ఎన్జీవో నీలం సంపత్ పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >