Posted on 2026-04-17 14:30:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రహదారి భద్రత వారోత్సవాల్లో “అర్రైవ్ అ లైవ్” కార్యక్రమం కింద దమ్మపేటలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలు, వాటి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. గుడ్ సమారిటన్ విధానం, పీఎం అర్హత్ పథకం గురించి వివరించారు.
ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సైబర్ మోసాలు మరియు రహదారి ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణ నష్టం కుటుంబాలకు తీవ్రమైన దెబ్బ అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. గ్రామసభల ద్వారా రహదారి భద్రతపై తీర్మానాలు తీసుకోవాలని సూచించారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >