Posted on 2026-04-21 13:32:20
రక్తదాతలకు హెల్మెట్ లను అందజేసిన జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి నాగరాణి
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్,జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి నాగరాణి హెల్మెట్ల ను,ప్రశంస పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాత లేని, మహనీయుల జయంతుల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని,సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ బాలు ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని, నిబంధనలను పాటించాలని సూచించారు.కార్యక్రమాన్ని నిర్వహించిన ఐవిఎఫ్,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్,ప్రధాన కార్యదర్శి ఎర్రం విజయ్ కుమార్,యువజన విభాగం అధ్యక్షులు ఎర్రం ఈశ్వర్, కొమిరిశెట్టి గంగ రాజం,అర్వపల్లి రమేష్,కూర దిగంబర్, తాటిపాముల సుధాకర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >