| Daily భారత్
Logo




మాంసం వండలేదని భర్త గొడవ.. కొడవలి విసిరిన భార్య

News

Posted on 2026-04-27 15:14:58

Share: Share


మాంసం వండలేదని భర్త గొడవ.. కొడవలి విసిరిన భార్య

డైలీ భారత్, కామారెడ్డి:మాంసాహారం వండలేదన్న విషయంలో మొదలైన చిన్నపాటి గొడవలో క్షణికావేశానికి గురైన భార్య.. భర్తపైకి కొడవలి విసరడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. గోసంగికాలనీకి చెందిన కోదండం శివాజీ(28), లక్ష్మికి 2017లో వివాహమైంది. వీరికి ఐదేళ్లు, రెండేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్తుండగా.. శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేసేవారు. శనివారం రాత్రి ఇంటికి చేరుకున్న శివాజీ మాంసాహారం ఎందుకు వండలేదని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగా అరుచుకున్నారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి సముదాయించడంతో కాసేపు ఊరుకున్నారు. మళ్లీ తనను తిట్టడంతో కోపోద్రిక్తురాలైన లక్ష్మి అక్కడే ఉన్న కొడవలిని శివాజీపైకి బలంగా విసిరారు. అది అతని మెడ భాగంలోని నరానికి తగిలి తీవ్ర రక్తస్రావమై 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోయారు.

క్షణికావేశంలో భర్తనే చంపుకొన్నానని, తాను జైలుకు వెళితే పిల్లలను ఎవరు చూసుకుంటారని ఇద్దరు బిడ్డలను ఒడిలోకి తీసుకొని లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శివాజీ సోదరుడు సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >