| Daily భారత్
Logo




కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

News

Posted on 2026-04-27 18:15:44

Share: Share


కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని గోసంగీ కాలనీలో చోటుచేసుకున్న హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేశారు.

తేదీ 25.04.2026 న మృతుడి అన్న కోదండం సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. అదే రోజు రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో మెడపై దాడి చేయగా, అతను తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది.

సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, రక్తపు నమూనాలు మరియు ఇతర భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విశ్వసనీయ సమాచారం మేరకు తేదీ 27.04.2026 న కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు, హత్యకు ఉపయోగించిన కొడవలి మరియు రక్తపు మరకలతో ఉన్న చీరను చూపించగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో మృతుడు మద్యం సేవించడం, జూదం అలవాటు, అలాగే కుటుంబ సమస్యలపై తరచూ భార్యను వేధించడం వలన ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. 25.04.2026 న జరిగిన ఘర్షణలో నిందితురాలు ఆవేశానికి లోనై ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది.

ఈ కేసును కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాస్  పర్యవేక్షణలో, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ బి. నరహరి సమర్థవంతంగా విచారించి నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >