| Daily భారత్
Logo




ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

News

Posted on 2026-05-11 10:01:16

Share: Share


ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

కాకినాడలో దారుణం.. ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు హత్య

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితుడు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పాత కక్షల కారణంగానా లేక వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో జరిగిందా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

మృతుడు జి. నాగేశ్వరరావు (46)గా గుర్తించారు. ఆయన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >