Posted on 2026-05-11 10:27:51
తడిసిన మొక్కజొన్నలను సైతం బేశరత్తుగా కొనుగోలు చేయాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట మార్కెట్ను సందర్శించిన ఏఐకెఎఫ్ బృందం
డైలీ భారత్, నర్సంపేట ప్రతినిధి: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బేసరత్తుగా రైతుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలలో తడిసిన మొక్కజొన్నలను సైతం ప్రభుత్వమే బాధ్యత వహించి కొనాలని కోరారు.
అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి మొక్కజొన్న రైతుల ఇబ్బందులను కొనుగోళ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష 7వేల ఎకరాలలో మొక్కజొన్నలు పండించారని సుమారు మూడు లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వ యంత్రాంగానికి అంచనా ఉన్న అందుకు సరిపడా కొనుగోలు కేంద్రాలను యంత్రాంగాన్ని గోదాములను సిద్ధం చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. కావాలనే రైతుల మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తూ పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు దళారులకు వత్తాసు పలికి రైతులకు మద్దతు ధర రాకుండా చేస్తుందని, నెలరోజులపైగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు మక్కజొన్నలను కుప్పలు పోసి బస్తాలు నింపి కుటుంబానికి దూరంగా మార్కెట్లోనే రోజుల తరబడి గడుపుతూ నరకయాతన అనుభవిస్తున్న ప్రభుత్వానికి కనీస చలనం లేకపోవడం ఆందోళనకరమన్నారు. దీనికి తోడు అకాల వర్షాలు రైతులను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇప్పటికే కొన్నిచోట్ల అకాల వర్షాలకు రైతుల మొక్కజొన్నలు తడిసాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి తక్షణమే రైతుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేకపోతే రైతులకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు ఎం సి పి ఐ (యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ లతోపాటు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >