| Daily భారత్
Logo




అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

News

Posted on 2026-06-18 20:52:31

Share: Share


అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులు అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. ఢిల్లీ, హర్యానాలో నెయ్యి తయారీ, పంపిణీ కేంద్రాలపై దాడులు చేశారు. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. (Adulterated Ghee Seized) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, నిర్దేశిత లేబులింగ్ సమాచారం లేకుండా ప్రీమియం ఆవు నెయ్యి అమ్మకాలకు సంబంధించిన డిజిటల్, ప్రింట్ ప్రకటనలను అధికారులు గమనించారు. పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానించారు. కస్టమర్ల మాదిరిగా ఆ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. వాటిని అక్రిడిటెడ్ ప్రయోగశాలకు పంపి పరీక్ష చేయించారు.

కాగా, ఆ నెయ్యి ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కూరగాయలు, ఇతర నూనెలు, పాలేతర పదార్థాల మిశ్రమం ఉన్నట్లు నిర్ధారించారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. కల్తీ నెయ్యి తయారీ, నిల్వ, పంపిణీ నెట్‌వర్క్‌ను గుర్తించారు.

మరోవైపు జూన్ 17న కేంద్ర ఆహార భద్రతా అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు, పోలీసులు కలిసి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్‌ చేశారు. ఢిల్లీలోని ద్వారక సమీపంలోని ధుల్సిరాస్ గ్రామంలో ఉన్న రహస్య తయారీ కేంద్రంలో సోదాలు చేశారు. నకిలీ నెయ్యి తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తున్న 1,020 లీటర్ల అనుమానిత నూనె, 1,500 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే హర్యానాలోని సోనిపట్‌ సెక్టార్ 53లోని బాలాజీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ సంస్థపై అధికారులు రైడ్‌ చేశారు. మార్కెట్‌లో పంపిణీ కోసం ప్యాక్ చేసిన 4,000 లీటర్లకు పైగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీ, పంపిణీలో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. కొందరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు తెలిపారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >