| Daily భారత్
Logo




మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

News

Posted on 2026-06-18 20:54:39

Share: Share


మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

డైలీ భారత్, బెగుస‌రాయి: బీహార్‌లో గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న జ‌రిగింది. బెగుసురాయిలోని ఓ ఇంట్లోకి అయిదుగురు వ్య‌క్తులు ప్ర‌వేశించి.. మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. భ‌ర్త‌ను ఓ గ‌దిలో క‌ట్టిప‌డేసి, మ‌హిళ‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. తీవ్ర క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్న బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే చికిత్స స‌మ‌యంలో డాక్ట‌ర్లు షాక్ అయ్యారు. బాధితురాలి మ‌ర్మాంగం నుంచి ఓ బుల్లెట్‌, రాయి, చెక్క ముక్క‌ను తీశారు. అత్యంత క్రూర రీతిలో దుండ‌గులు రేప్‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు చెప్పారు.

చాకియా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జూన్ 11వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాత్రి 11.30 నిమిషాల స‌మ‌యంలో టాయిలెట్ కోసం వెళ్లిన‌ప్పుడు అయిదుగురు వ్య‌క్తులు ఇంట్లోకి చొర‌బ‌డిన‌ట్లు బాధితురాలు చెప్పింది. భ‌ర్త‌ను ఓ రూమ్‌లో తాళం వేసి, త‌న నోరు నొక్కి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఆ మ‌హిళ ఫిర్యాదులో పేర్కొన్న‌ది. చికిత్స కోసం తొలుత బ‌రౌనీ ఆస్ప‌త్రికి, ఆ త‌ర్వాత స‌ద‌ర్ ఆస్ప‌త్రికి వెళ్లిన‌ట్లు చెప్పింది.స‌ద‌ర్ ఆస్ప‌త్రిలో చికిత్స స‌మ‌యంలో త‌న మ‌ర్మాంగం నుంచి బుల్లెట్‌, రాయి, చెక్క ముక్క‌ను తీసిన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది.

గ్యాంగ్ రేప్ స‌మ‌యంలో స్పృహ కోల్పోవ‌డం వ‌ల్ల ఎలా త‌న ప్రైవేట్ భాగాల్లోకి ఆ వ‌స్తువులు వ‌చ్చాయో తెలియ‌లేద‌న్న‌ది. మూడు నెల‌ల క్రితం కూడా ఓసారి ముగ్గురు వ్య‌క్తులు త‌మ ఇంట్లోకి చొర‌బ‌డి గ్యాంగ్ రేప్‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆమె చెప్పింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న‌ది. ఈ షాకింగ్ కేసులో ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. నిందితుల‌ను త్వ‌ర‌లో ప‌ట్టుకోనున్న‌ట్లు పోలీసులు చెప్పారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >